VZM: ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని CITU జిల్లా కార్యదర్శి జగన్మోహన్ మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు యాప్లను రద్దు చేసి పని భారం తగ్గించాలని స్దానిక రూరల్, అర్బన్ ప్రాథమిక కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేపట్టించుకుని కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.