బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ (MP Girish Bapat) కన్నుమూశారు. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న పుణే (Pune) ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు.
బీజేపీ ఎంపీ గిరీశ్ బాపట్ (MP Girish Bapat) కన్నుమూశారు. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న పుణే (Pune) ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. తమ పార్టీ ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న నేత అని కొనియాడారు. మహారాష్ట్ర (Maharashtra) అభివృద్ధి ఆయనకు ప్రాధాన్యతా అంశం అని, పుణే ఉన్నతస్థాయిలో ఉండాలని ఎంతో కృషి చేశారని ప్రధాని తెలిపారు . గిరీశ్ బాపట్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు మోదీ వెల్లడించారు.
మహారాష్ట్రలో బీజేపీని (BJP) బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక సేవలు అందించారని, అటువంటి నేత అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు. గిరీశ్ బాపట్ (Girish Bapat) కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. గిరీశ్ బాపట్ గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కస్బాపేట్ (Casbapate) నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో లోక్ సభకు (Lok Sabha) పోటీ చేసి పుణే నుంచి గెలుపొందారు. కాగా, గిరీశ్ బాపట్ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.