తొలి సినిమా (Movie)తో కలిశారు.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు (Love).. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి (Marriage) చేసుకున్నారు.. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. కొన్నేళ్లు గడిచాక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సానుకూల వాతావరణంలో ఇద్దరు విడాకులు (Divorce) తీసుకుని చెరో దారిన వెళ్లిపోయారు. కానీ సమాజం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లను ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతిచోట దానిపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా తమ వివాహ బంధం ముక్కలు కావడంపై సమంత (Samantha Ruth Prabhu) స్పందించింది. తన తప్పు లేదని, తప్పు లేనప్పుడు ఎందుకు బాధపడాలి? అని ప్రశ్నించింది.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam Movie) సినిమా చేస్తోంది. అందులో యువరాణి పాత్రలో మెరిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ (Promotions) కార్యక్రమంలో సమంత చురుగ్గా పాల్గొంటున్నది. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తో జరిగిన విడాకుల విషయమై తొలిసారి నోరు విప్పింది. ఆ విషయాలపై సమంత స్పందించింది.
‘విడాకులు తీసుకున్న కొంతకాలానికే నాకు ‘పుష్ప’లో (Pushpa) ‘ఊ అంటావా’ ఐటమ్ సాంగ్ అవకాశం వచ్చింది. నేను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లో ఎందుకు కూర్చోవాలని అనిపించింది. వెంటనే ఆ అవకాశాన్ని అంగీకరించా. అయితే ఆ పాట చేస్తున్నానని తెలిసి ఇంట్లో వాళ్లు (Family), బంధుమిత్రులు (Relatives) అభ్యంతరం తెలిపారు. ఇంట్లో కూర్చో చాలు.. విడాకులు తీసుకున్న నువ్వు ఐటమ్ సాంగ్స్ చేయడం బాగుండదు అని హితవు పలికారు. నాకు వెన్నంటే ఉండేవారు కూడా వద్దని చెప్పారు. కానీ వారి మాట నేను వినలేదు. ఎందుకంటే వివాహ బంధంలో నేను వంద శాతం నిజాయతీగా ఉన్నా. దురదృష్టవశాత్తు అది నిలబడలేదు. అటువంటప్పుడు నేను ఏదో నేరం (Crime) చేసిన వ్యక్తిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని తప్పుకు నాలో నేను ఎందుకు బాధపడాలి?’ అని సమంత ప్రశ్నించింది.
2010లో విడుదలైన ‘ఏ మాయ చేశావే’ (Ye Maya Chesave) సినిమాతో నాగచైతన్యతో సమంత ప్రేమలో పడింది. అప్పటి నుంచి వారి ప్రేమ బంధం కొనసాగింది. 6 అక్టోబర్ 2017న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 2 అక్టోబర్ 2021న విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చెరో దారిలో ప్రయాణిస్తున్నారు. కాగా ఈ విడాకుల నుంచి చైతూ ఇంకా కోలుకోనట్లు తెలుస్తున్నది. అతడికి సంబంధించిన సినిమాల విషయమై ఇంకా ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. కానీ సమంత మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నది. తరచూ సినిమా కార్యక్రమాలకు హాజరవుతూ గతం నుంచి తేరుకుంటోంది. కాగా సమంత చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. దానికి చికిత్స తీసుకుంటూనే సినిమాలు చేస్తున్నది. విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) కలిసి సమంత ఖుషీ (Kushi Movie) అనే సినిమా చేస్తోంది.