నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే ఉందా? అనే సందేహాలు ఎప్పటికప్పుడు వినిపిస్తునే ఉంటాయి. మధ్యలో ఏవో వార్తలొచ్చినా ఏం లేదని అన్నారు. కానీ లేటెస్ట్గా సామ్ లవర్‌తో దొరికేసినట్టేనని అంటున్నారు.
Samantha: నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా చాలా ఇబ్బంది పడింది సమంత. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు కూడా దూరమైంది. ప్రస్తుతం ఒంటరిగానే స్ట్రగుల్ అవుతోంది. విదేశాలకు, వెకేషన్లకు తిరుగుతోంది. కానీ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నానని చెబుతోంది. తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. అలాగే నిర్మాతగా కూడా సినిమాలు చేయనుంది. కానీ నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత.. సమంత ఒంటరిగానే ఉందా? అనేదే ఇక్కడ కొందరి డౌట్.
అయితే.. ఆ మధ్య సమంత పై ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని.. ఆ పెళ్లి చేసుకోవడం సమంతకు ఇష్టం లేదని వినిపించింది. కానీ అంతకంటే.. ముందే ప్రీతమ్ జుకాల్కర్ విషయంలో హాట్ టాపిక్ అయింది సామ్. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో తరచుగా కనిపించింది సమంత. దీంతో ఈ ఇతనితోనే సామ్ రిలేషన్లో ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని సమంత, ప్రీతం జుకాల్కర్.. జస్ట్ మేం ఫ్రెండ్స్ అంటూ కొట్టిపారేశారు. ఆ మధ్య ఇద్దరికి చెడిందని కూడా టాక్ నడిచింది.
దీంతో కొన్ని రోజులుగా సామ్‌తో కనిపించలేదు ప్రీతమ్. అయితే లేటెస్ట్గా ప్రీతం జుకాల్కర్‌తో కలిసి కనిపించింది. అతనితో కలిసి పద్మావతి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంది. ఆ తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇక్కడ కూడా సమంతతో పాటు అక్కడ ప్రీతం జుకాల్కర్ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు మొదలయ్యాయి. అన్నట్టు చై, సామ్ విడిపోవడానికి ప్రీతమ్ కూడా ఓ రీజన్ అనే టాక్ ఉంది.