ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను (MLC KAVITHA) మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన ఈడీ మరోసారి కొన్ని విషయాలపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scan) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను (MLC KAVITHA) మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు విచారణ జరిపిన ఈడీ మరోసారి కొన్ని విషయాలపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తోంది. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్లను ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాను పరిశీలిస్తున్నందున స్వయంగా గానీ, ఆమె ప్రతినిధి హాజరు కావాలని ఈడీ సూచించడంతో కవితకు బదులు ఆమె న్యాయవాది సోమా భరత్ (Advocate Soma Bharat) ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్ల లాక్ కు సంబంధించి ఆమెను రమ్మని పిలిచారు. ఫోన్ల పరిశీలనకు ఆథరైజ్డ్ పర్సన్ ను పంపించమని తెలిపింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపున ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోమ భరత్.. మరోసారి ఈడీ ఆఫీస్‌కి (ED OFFICE) వెళ్లారు. కవిత మొబైల్‌లలో డేటా, ఇతర అంశాలపై భరత్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే మరోసారి విచారణకు పిలవలేదని కేవలం తమకు ఉన్న అనుమానాలను క్లియర్ చేసుకునేందుకు పిలిచినట్లు సోమ భరత్ తెలిపారు. ఇదిలా ఉండగా, లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటున్న కవిత.. ఇప్పటి వరకు ఈడీ అధికారుల(ED Officer) ముందు మూడు సార్లు హాజరయ్యారు. ఈడీ విచారణ విషయంలో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. మహిళలకు ఇంటి వద్దనే విచారణ చేపట్టేలా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ (Petition)వేశారు. ఆమె పిటిషన్ మరో 3 వారాల తర్వాత విచారణు రానుంది.