Traffic Rules : శ్రీరాముని శోభయాత్ర… రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Rules : దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దేశవ్యాప్తంగా రేపు శ్రీరామనవమి పండగను జరుపుకోనున్నారు. రేపు అన్ని రామాలయాల్లో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ క్రమంలోనే నగరంలో రేపు రాముని శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శోభాయాత్ర కొనసాగే పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయని, అదే విధంగా ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేస్తారని ప్రకటించారు.
ఇక ముఖ్యంగా గోషామహల్,సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అధికంగా ఉంటాయని వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్లు కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
బోయగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీసు స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్ పేట్, పురానా పూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీద్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు ఈ యాత్ర చేరుకుంటుంది.
కాబట్టి ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరో వైపు ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.