ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రచారాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా మరో పోస్ట్‌ను పెట్టారు. అది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Hyderabad traffic police's post asking traffic rules to be obeyed is viral on the net
Hyderabad traffic police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా ప్రజలు వినరు. ఫైన్లు కడుతారు తప్ప హెల్మెంట్ ధరించరు, రాంగ్ రూట్ మానరు. తాజాగా పోలీసులు సరికొత్త పద్దతిలో ప్రజలు చేసే తప్పులను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వాటితో వినుత్న ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కుమారి అంటీ ఫుడ్ స్టాల్ గురించి తెలిసిందే. మీది మొత్తం వెయ్యి అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్‌ను ఉపయోగించుకొని ఓ పోస్ట్ పెట్టారు.
ఓ వ్యక్తి హెల్మెంట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ ద్విచక్రవాహనం నడుపుతున్నాడు. దాన్ని ఫోటో తీసిన ట్రాఫిక్ పోలీసులు మీది మొత్తం వెయ్యి అయింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని రాసుకొచ్చారు. ఈ మేరకు బీసేఫ్ యాష్ ట్యాగ్‌తో హైదరాబాద్ సిటీ పోలీసుల హ్యండీల్ నుంచి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇలానైనా వాహనదారుల్లో మార్పు వస్తుందేమో అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.