కడప: వీరపునాయనపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాల వీరయ్య మృతి చెందాడు. ముకుంద ట్రావెల్స్‌కు చెందిన బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108లో సమీప ఆసుపత్రికి తరలించారు.