SRPT: రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలోని శంకర్ విలాస్ సెంటర్లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. గత నెల రోజులుగా రాంగ్ డ్రైవింగ్ చేస్తున్న 150పైగా వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమాలు వాహన చోదుకులు పాటించాలని అన్నారు.