E.G: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సీతానగరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన గణపతి గురువారం తెల్లవారుజామున అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.