MDK: జిన్నారం గ్రామ 8, 9వ, వార్డులోని మాల కుల సంఘానికి లక్ష రూపాయలతో టెంట్ హౌస్ సామాగ్రిని మాజీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం గౌడ్, భోజి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, నీలం మోహన్, బ్రహ్మేందర్ గౌడ్, నర్సింగ్ రావు, ఏర్పుల లింగం, మల్లేష్ ఉన్నారు.