బాపట్ల: కోడిపందాలు, పేకాట, మట్కా నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సంక్రాంతి సెలవులకు విహార యాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దొంగతనాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలుపై చర్యలు తీసుకుంటామన్నారు.