SMSలో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను ఎయిర్టెల్ నియోగించనుంది. గూగుల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చే వెబ్ లింక్‌లను కూడా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడనుంది. వినియోగదారులు డిజిటల్ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు సంస్థలూ ప్రకటించాయి.