NLR: కొండాపురం మండలంలోని ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్లే ఆర్అండ్బీ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని బీజేపీ నేతలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు తేలి ప్రయాణానికి వీలులేకుండా ఉన్న ఈ దారి వల్ల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.