KDP: ప్రస్తుత రబీ సీజన్లో వేముల మండలంలో 1,875 మంది రైతులు సుమారు 7,500 ఎకరాల్లో శనగ పంట సాగు చేసినట్లు వేముల ఏవో ఓబులేసు తెలిపారు. ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయిందని, ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో ఈ-క్రాప్, ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు అందుతాయన్నారు.