SRPT: ఆత్మకూరు ఎస్.మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా బాధ్యతలు చేపట్టి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయురాలిగా దడిగల శ్రీవర్ష, కలెక్టర్గా ఎల్లుట్ల అంజలి, డీఈవోగా కత్తుల శృతి, ఎంఈవోగా ఎరుకల విష్ణువర్ధన్ వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధ్యాపకులు బహుమతులు అందజేశారు.
Tags :