»Mafia Don Atiq Ahmed Fearing Encounter From Up Police
Mafia Don: యూపీ పోలీసులు నన్ను చంపేస్తారేమో.. మాఫియా డాన్ అతిక్ భయం భయంగా…
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు. అతనిని ప్రయాగ్ రాజ్ జైలుకు (Uttar Pradesh Prayagraj jail) తీసుకు వెళ్లేందుకు ఆ జైలు అధికారులు గుజరాత్ లోని సబర్మతి జైలుకు (Sabarmati central jail ) వచ్చారు. సదరు మాఫియా డాన్ బయటకు రాగానే మీడియాను చూసి.. హత్య.. హత్య.. అంటూ అరిచాడు. పోలీసులు అతనిని వ్యాన్ ఎక్కిస్తున్న సమయంలో నీకు ఏమైనా ప్రాణ భయం ఉందా అని ప్రశ్నించగా… ఈ సమాజ్ వాది పార్టీ మాజీ ఎంపీ మాట్లాడుతూ… నాకు వారి కార్యక్రమం తెలుసు… వారు నన్ను చంపాలనుకుంటున్నారు.. ప్రయాగ్ రాజ్ కోర్టులో తనను హాజరుపరిచే సాకుతో వారు తనను చంపవచ్చునని చెప్పాడు. ప్రయాగ్ రాజ్ జైలు అధికారులు అతనిని యూపీకి తరలించారు.
అతిక్ అహ్మద్ గతంలో సమాజ్ వాది పార్టీ రాజకీయ నాయకుడు. గ్యాంగ్ స్టర్ గా మారాడు. వందకు పైగా క్రిమినల్ కేసుల్లో ఇతని పేరు ఉంది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతను ప్రధాన నిందితుడు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్. అతని ఇద్దరు భద్రతా సిబ్బందిని ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి అతనిని ప్రయాగ్ రాజ్ జైలుకు తరలించేందుకు పోలీసు బృందం సబర్మతికి చేరుకున్నది. కిడ్నాప్ కేసుకు సంబంధించి అతిక్ ను మార్చి 28న కోర్టు ముందు హాజరు పరచాలని, అదే రోజు తీర్పు వెలువరించనున్నట్లు ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు.
పాత కిడ్నాప్ కేసులో తీర్పును ప్రటించేందుకు మార్చి 28వ తేదీని నిర్ణయించింది న్యాయస్థానం. ఈ కేసు నిందితులందరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలి. ఇందులో భాగంగా నిందితుడైన మాఫియా డాన్ అతిక్ అహ్మద్ ను కోర్టు ఎదుట హాజరు పరిచేందుకు పోలీసుల బృందాన్ని సబర్మతికి పంపించారు. ప్రయాగ్ రాజ్ జైలు ప్రాంగణంలో వీడియో వాల్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తారు. అతిక్ ను యూపీ తరలిస్తున్న వాహన శ్రేణి సోమవారం ఉదయం రామ్ నగర్ టోల్ ప్లాజాను దాటి, మధ్యప్రదేశ్ లోని శివపురికి చేరుకున్నది. సబర్మతి నుండి ఆదివారం సాయంత్రం బయలుదేరింది అతని వాహనం. రాత్రి ఎనిమిది గంటల తర్వాత రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఉదయం మధ్యప్రదేశ్ కు చేరుకున్నది.