T20 WCలో రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.