ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమాయత్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అని ప్లాన్లు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో… ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు మిగిలిన ప్రతిపక్షాలన్నీ కలిసిపోతే తప్ప… ఆ పార్టీని ఎదురించే సత్తా లేదనే చెప్పాలి.
వైసీపీని ఎదురించేందుకు టీడీపీ ఒక్కటి సరిపోదు.. దానికి జనసేన, బీజేపీ రెండింటి అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఇక్కడ సరైన నాయకులు లేకపోవడం వల్ల… జనాల్లోకి వెళ్లలేకపోతోంది. ఉన్న నాయకులు కూడా.. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే… దానికి మరో పార్టీతో పొత్తు చాలా అవసరం. అందుకే వీరు పవన్ వెంట పడటం మొదలుపెట్టారు…. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం వారికి పెద్దగా ఇష్టం లేదు.
అయితే… ఇటీవల పవన్ కోరిన రోడ్ మ్యాప్ ను బీజేపీ ఇవ్వకపోవడంతో పవన్ చంద్రబాబు వైపు దృష్టి పెట్టారు. పవన్ కోరినన్ని సీట్లు ఇవ్వలేనని చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారని సమాచారం అందుతోంది. సీట్లు తగ్గినా పరవాలేదని పవన్ భావిస్తే చంద్రబాబు పవన్ పార్టీల పొత్తుకు సంబంధించిన అధికారిక ప్రకటనకు ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో టీడీపీ జనసేనలకు బీజేపీ మద్దతు ఉంటే బాగుంటుందని పవన్(pawan kalyan) భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు కుదర్చే పని కూడా పవన్ భుజాలపై పడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది.
కేంద్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ మినహా మరో పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీ మద్దతు ఉంటే టీడీపీ జనసేన కూటమికి ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉండాలని భావిస్తే పొత్తు పెట్టుకోవడం మినహా బీజేపీకి మరో ఆప్షన్ అయితే లేదని చెప్పవచ్చు. అయితే గత పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఇందుకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.