TG: హైదరాబాద్ కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఠం భూముల వ్యవహారంపై నెలకొన్న గందరగోళం కేవలం సమాచార లోపం వల్లేనని స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పీఠం తన కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించుకోవచ్చని భరోసా ఇచ్చారు.