భారత సంతతికి చెందిన రిషి సునక్(rishi sunak) బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో యూకే పీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. నిజానికి ఆదివారం రాత్రి ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఊహించినా బోరిస్ జాన్సన్ సహా పెన్నీ మోర్డాంట్ కూడా రేసు నుంచి తప్పుకున్నారు. ఇక పెన్నీ మోర్డాంట్ ఇప్పటివరకు కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పాలైన రిషి సునక్‌కు 150 మందికి పైగా ఎంపీల మద్దతు ఉంది.
బ్రిటన్ ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కనీసం వంద మంది ఎంపీల మద్దతు ఉండాలి. రిషి సునక్‌కు ఇప్పటికే వంద మంది ఎంపీలు అధికారికంగా మద్దతు ఇవ్వగా మరో 50 మంది కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ప్రధాని కావడం దాదాపు ఖరారైపోయింది. ఇక రిషి సునక్ తాను పోటీ చేస్తున్నానని ఆదివారం ప్రకటించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాక పార్టీలో ఐకమత్యాన్ని తీసుకురావడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు. “దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని నాకు ఉంది, పార్టీలో ఐక్యతను తీసుకురావాలనుకుంటున్నాను.” అని రిషి సునక్ ఒక ట్వీట్ కూడా చేశారు.