కృష్ణా: రాజ్యసభ సభ్యులు వీ. విజయేంద్ర ప్రసాద్ ఎంపీ లాడ్స్ నిధులతో చల్లపల్లిలో ప్రహరీ గోడ నిర్మించారు. రూ.30 లక్షలతో గ్రామంలోని పంచాయతీ డంపింగ్ యార్డ్ వద్ధ నుంచి మంచినీళ్ల చెరువు వరకు 304 మీటర్లు పొడవైన ప్రహరీ గోడ నిర్మించారు. తద్వారా డంపింగ్ యార్డ్ వ్యర్థముల కారణంగా ఎన్టీఆర్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.