ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu swamy) గురించి తెలిసే ఉంటుంది. సెలబ్రెటీల జీవితం అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. వాళ్లు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటారు, కెరీర్ అలా ఉంటుంది, ఇలా పడిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. తాజాగా ఆయన టీడీపీ, జనసేన పొత్తుపై తాజాగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
జనసేన టీడీపీ బీజేపీ కలిసి పనిచేస్తే సంచలనం నమోదవుతుందని అన్నారు. పవన్ కల్యాణ్ కింద చంద్రబాబు, లోకేష్ పనిచేస్తారా అని ప్రశ్నించారు. వీళ్లు ఒకే స్టేజిపై కనిపిస్తే ప్రపంచ వింతే అన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు.
చంద్రబాబు గారిది పుష్యమి..పవన్ కల్యాణ్ ది ఉత్తర ఆషాడ నక్షత్రాలు ఈ రెండూ విరుద్దంగా ఉంటాయని అస్సలు పడవని అన్నారు. వీళ్లు దూరంగా ఉంటేనే బాగుంటారు దగ్గరకొస్తే కలవరని చెప్పారు. జాతకం ప్రకారం చంద్రబాబు పవన్ కలిస్తే అధికారం కాదని అందకారం అని అన్నారు. వీళ్లు కలిసినా వాళ్ల నక్షత్రాలు కలవవని అది ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారుతుందని వేణుస్వామి జోతిష్యం చెప్పారు. చూడాలి ఈసారి వేణు స్వామి జోశ్యం నిజమవుతుందో లేదో చూడాలి.