గద్వాల మున్సిపాలిటీలో 14వ వార్డు (గంజిపేట) సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీఆర్ఎస్ నేత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా.. బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.