»Elon Mask Who Blocked God Twitter Account Netizens Comments
Elon Mask: గాడ్ ని బ్లాక్ చేసిన ఎలాన్ మాస్క్..నెటిజన్ల కామెంట్స్
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న టెస్లా, ట్విట్టర్(twitter) సీఈఓ ఎలాన్ మాస్క్(Elon Mask) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రతి సారి వినూత్నంగా ఏదో ఒక ప్రకటన చేస్తూ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు చుశాం. తాజాగా ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో గాడ్(God)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు అదేంటి దేవుడికి కూడా ట్విట్టర్ అకౌంట్ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం దేవుడిని ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ట్విట్టర్లో ఎవరో గాడ్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేశారని చెప్పడానికి ఇలా చేశారా లేదా ఫన్నీగా పంచుకున్నారా లేదా గాడ్ అనే పదాన్ని బ్లాక్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ పోస్ట్‌కి మూడు రోజుల్లోనే 5.2 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. దాదాపు 6 వేల మంది ఆ పోస్టును(post) షేర్ కూడా చేశారు. ఈ పోస్టును 77 వేల మందికిపైగా లైక్ చేశారు. కానీ ఆ పోస్టును మాత్రం ఇంకా తొలగించలేదు. దీనిపై నెటిజన్లు సైతం ఆసక్తిగా ఉన్నారు. ట్విట్టర్ వినియోగాన్ని మరింత పెంచడానికే ఎలాన్ మాస్క్(Elon Mask) ఇలా చేశాడని ఇంకొంత మంది అంటున్నారు.
అయితే గతంలో ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కరోనా వ్యాక్సిన్(covid vaccine) తీసుకుంటే తనకు మాత్రం వద్దని ప్రకటించారు. మరోవైపు మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాప్తి తగ్గదని వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడి కోసం ఇళ్లల్లో ఉండటం కూడా వృథా అని తెలిపారు. పుట్టినవాళ్లు మరణించకతప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దానికి ముందు ప్రపంచంలోనే ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ అమెరికా(usa)లోని శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయానికి అద్దె కూడా చెల్లించలేదు. డిసెంబర్, జనవరి నెలలకు ట్విట్టర్(twitter) సంస్థ రెంట్ పే చేయలేదని సంబంధిత యజమాని చర్యలు కూడా తీసుకున్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది.