Parinithi Chopra : ఎంపీతో హోటల్లో స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
Parinithi Chopra : హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు.
హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. హీరోయిన్ల విషయాల్లో ఇదంతా కామన్ అనే టాక్ వింటునే ఉంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఓ బడా పొలిటీషియన్తో రెస్టారెంట్లో కెమెరా కంట పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో అనుకున్నంత స్థాయిలో స్టార్డమ్ అందుకోలేదు గానీ.. అమ్మడి అందానికి ఫిదా కానీవారుండరు. చేసిన కొద్ది సినిమాలు కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఆమె మరెవరో కాదు పరిణీతి చోప్రా. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూపు తిప్పుకొని అందం ఆమె సొంతం. ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజీన్. సినిమాల కంటే ఎక్కువగా ఫారిన్ టూర్లతోనే ఫుల్ బిజీగా ఉంటుంది అమ్మడు. 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ భల్’ మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. కాకపోతే సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి కనిపించింది. ఓ రెస్టారెంట్లో నుంచి బయటకు వస్తుండగా వీళ్లిద్దరూ మీడియా కెమెరాల కంటికి చిక్కారు. దీంతో ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ.. బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.. కానీ పరిణీతి, రాఘవ్‌లు మాత్రం ఇప్పటి వరకు దీనిపపై రెస్పాండ్ అవ్వలేదు. దీంతో డేటింగ్ రూమర్స్‌లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరి వీడియో మాత్రం వైరల్‌గా మారింది.