జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ రచనలను ట్విట్టర్లో పబ్లిష్ చేయాలని కోరారు. ఆ రచనలకు వినియోగదారుల నుంచి మనీ వసూల్ చేస్తానని అంటున్నారు.
Elon Mask: ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత నిత్యం న్యూస్ అవుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులకు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ కథనాలను జర్నలిస్టులు నేరుగా ట్విట్టర్లో ప్రచురించుకోవచ్చని తెలిపారు. తమ రచనల్లో మరింత స్వేచ్ఛ తీసుకుని.. కథనాలను రాసుకోవాలని.. ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకునేవారికి ఇదొక ఆఫర్ అని ప్రకటించారు.
జర్నలిస్టులు రాసిన కథనాలు చదవాలంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు. చదివే ప్రతి ఆర్టికల్ నుంచి మనీ చార్జీ చేస్తారు. ఓ రచయిత కథనాలను చదవాలంటే నెలవారీ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలని కోరుతున్నారు. సబ్ స్క్రైబ్ వద్దనుకుంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో.. రచయితలకు మంచి వేదికను మస్క్ రెడీ చేస్తున్నారు. ఇందుకు వినియోగదారుల నుంచి నగదు వసూల్ చేయబోతున్నారు.
సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, జర్నలిస్టుల ప్రొఫైల్ వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం డాలర్స్ వసూల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖాతాదారుల నుంచి డబ్బు వసూల్ చేసే ప్రణాళిక రచించారు. సో.. ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలీ.. కానీ ఔత్సాహిక జర్నలిస్టులకు మాత్రం మంచి ఆఫర్ ఇచ్చారు. ఫ్రాన్స్‌లో ట్విట్టర్ ఏఎఫ్‌పీ నుంచి కాపీరైట్ కేసు ఎదుర్కొంది. కథనాలను కాపీ చేశారని.. పరిహారం అందజేయాలని ఎక్స్ పై కేసు నమోదైంది. ఇంతలో మస్క్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.