తెలంగాణలో ఇటివల పోటీపరీక్షల అభ్యర్థురాలు ప్రవళిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కుటుంబానికి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
brs minister ktr job offer to Pravallika brother netizens comments
హైదరాబాద్ అశోక్ నగర్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన ఉద్యోగార్థురాలు ప్రవళిక మృతి విషయంలో వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్ కీలక ఆఫర్ ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రవలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వారికి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అంతేకాదు ప్రవళిక మృతికి కారణమైన వారికి తప్పకుండా శిక్షపడేలా చూస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈమె మృతిని పలు పార్టీలు రాజకీయం చేశాయని ఆరోపించారు.
మరోవైపు కేటీఆర్ ఆమె సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించడం పట్ల పలువురు ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి ప్రేమ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటి పడిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయంలో వారి ఫ్యామిలీకి జాబ్ ఇవ్వడాన్ని అనేక మంది విమర్శిస్తున్నారు. ఇలా ఎవరికి పడితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఇక పరీక్షలు నిర్వహించడం ఎందుకని మరికొంత మంది అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఆమె వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోలేదని ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో గ్రూప్స్ సహా పలు రకాల పరీక్షలు వాయిదా వేయడం వల్లనే అలా చేసుకుందని అంటున్నారు.