కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయం సర్కిల్ నుంచి ప్రారంభించి… చెట్ట్నె హళ్లి, మాధవరం మీదుగా కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోకి రాహుల్ యాత్ర చేరుకుంది.
ఏపీలో రాయదుర్గం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో భారత్‌జోడో యాత్ర కొనసాగింది. ఏపీలో మొత్తం 120 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు.
కాగా, నేడు రాహుల్ గాంధీ పాదయాత్రకు వీడ్కోలు పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు మంత్రాలయంకు చేరుకున్నారు. మంత్రాలయంలో రాహుల్ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకొని సీట్లు సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేడర్ తగ్గిపోయినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉందని, ఆ బలంతోనే తిరిగి పుంజుకుంటామని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రేపు తెలంగాణలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.
ఇది కూడా చూడండి: కన్నాకి(Kanna lakshmi narayana) అధిష్టానం నుంచి బుజ్జగింపులు…!