లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఇండియన్ 2’. ఎన్నో అంచనాల మధ్య విడుదలై పరాజయం పొందింది. ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూలపై శంకర్ స్పందించారు. ఈ విధంగా రివ్యూలు వస్తాయని అసలు ఊహించలేదన్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 3’తో అద్భుతమైన చిత్రాలను అందించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.