JGL: ధర్మపురి గోదావరి తీరంలో గల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో గురువారం ఉదయం ధనుర్మాసం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సీతారాముల మూల విగ్రహాలకు అర్చకులు తాడూరి రఘునాథ శర్మ వేదోక్తంగా పంచామృతాలతో క్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ స్వామివారి అష్టోత్తర శతనామార్చనలు నివేదన మంగళ హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.