AP: జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలకు సీఆర్డీఏ ఆహ్వానం పలికింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటూ లేఖ రాసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశాల్లో రూ.45 వేల కోట్ల పనులను ఆమోదం లభించింది. ఈ నెలఖరులోగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే 2 నెలల్లో మరో రూ.15 వేల కోట్ల పనులకు టెండర్లు పిలువనున్నారు. నెలాఖరులోగా పనులకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.