W.G: వీరవాసరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.32,735 నగదును సేకరించారు. ఈ నేపథ్యంలోనే నగదుకు సంబంధించిన చెక్కును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వీరవాసరం ఎంపీడీవో కిరణ్ కుమార్ బుధవారం అందజేశారు. సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఎంపీడీవో కోరారు.