ELR: జిల్లాలో బుధవారం నిర్వహించిన 31 రెవెన్యూ సదస్సుల్లో 1,168 మంది పాల్గొని 258 అర్జీలు అందజేశారన్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. అందిన అర్జీలను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు నిర్వహించిన 199 గ్రామ రెవిన్యూ సదస్సులకు 9451 మంది హాజరై 2,221 అర్జీలు అందజేశారన్నారు.