GNTR: పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కొలువైన శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బుధవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉపాయంలో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.