GDWL: గద్వాల భీమ్ నగర్లో వెలిసిన సంతాన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు దేవాలయ ధర్మకర్తలు విక్రమ్ సింహా రెడ్డి, సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈనెల 21న ఉత్సవాలకు అంకురార్పణ, 22న పల్లకి సేవ, రాత్రికి రథోత్సవం, 23న పారువేట, నాగవళి, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయన్నారు.