MLC Kavitha: తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్?
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యిందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవితను దాదాపు ఏడు గంటల నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ ఇప్పటికే ఢిల్లీ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యిందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవితను దాదాపు ఏడు గంటల నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ ఇప్పటికే ఢిల్లీ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీంతోపాటు డాక్టర్లు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు అయిందనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈడీ ఆఫీస్ ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.