»Tpcc Chief Revanth Reddy Agitation At Osmania University
OUలో రేవంత్ రెడ్డి దీక్ష.. ఎప్పుడు, ఎందుకంటే?
Revanth reddy:పేపర్ లీకేజ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లీకేజీ గురించి కామెంట్స్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth reddy) సిట్ (sit) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీక్ష చేపడతారట.
Tpcc chief revanth reddy agitation at osmania university
Revanth reddy:పేపర్ లీకేజ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లీకేజీ గురించి కామెంట్స్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth reddy) సిట్ (sit) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీక్ష చేపడతారట. అదీ కూడా పోరాటాల పురిటిగడ్డ.. ఉస్మానియా యూనివర్సిటీ (osmania university) వేదికగా దీక్షకు దిగుతారట. 25వ తేదీ కూడా దీక్ష కొనసాగుతోందని తెలిసింది. ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై దీక్ష చేపడతానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీ అంశం అగ్గిరాజేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు కదం తొక్కాయి. సిట్ (sit) విచారించిన కేసులు నీరు గారిపోయాయని చెబుతున్నారు. లీకేజీ కేసును సీబీఐకి (cbi) అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో (TSPSC paper leak) ప్రధాన నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో (Praveen pen drive) మొత్తం 5 పేపర్లను గుర్తించారు. వాటిలో ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్ల పరీక్ష జరగలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ప్రవీణ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు ఇప్పటికే కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.