ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పొదిలి ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలపై కఠినంగా తనిఖీలు చేశారు.