AP: వైసీపీ నేత, ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో గౌతమ్ రెడ్డి అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రికి చెందిన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా రూ.25 లక్షలు సుపారీ ఇచ్చి అతడిని అంతమొందించేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.