»Revanth Reddy Counter To Minister Ktr Over Secunderabad Fire Accident
secunderabad fire accident: హైదరాబాద్ గొప్ప కాదు.. ప్రమాదాల్లేకుండా చూడండి.. కేటీఆర్కు రేవంత్
సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో (secunderabad, Swapnalok complex) జరిగిన ప్రమాదం (secunderabad fire accident) పైన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Congress Telangana president) రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో (secunderabad, Swapnalok complex) జరిగిన ప్రమాదం (secunderabad fire accident) పైన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Congress Telangana president) రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న యువత ఈ ప్రమాదంలో ఇలా మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇలా వరస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇటీవల సికింద్రాబాద్ లో వరసగా సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దక్కన్ మాల్ లో (Deccan Mall) జరిగిన సంఘటన మరిచిపోక ముందే స్వప్న లోక్ కాంప్లెక్స్ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. విశ్వనగరం అంటూ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడం కాదని, ప్రజలకు కనీస భద్రత కల్పించాలన్నారు. కుక్కలు ఒక పసివాడిని పీక్కు తిని చంపేశాయని గుర్తు చేశారు. గతంలో అగ్ని ప్రమాదం ఇద్దరిని, ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుందన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకోవాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
అంతకుముందు రోజు, ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము ఆ రోజు తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజు మీరు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ మీ నాన్న ముఖ్యమంత్రిగా, నువ్వు, నీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయ్యారని వ్యాక్యానించారు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ వైభవానికి కాంగ్రెస్ పార్టీ కారణమని గుర్తుంచుకోవాలన్నారు. యాత్ర ఫర్ చేంజ్ లో భాగంగా గురువారం 30వ రోజున… బోధన్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర అనంతరం బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ సభలో మాట్లాడారు.