ఖమ్మం: అశ్వాపురం మండలం మొండికుంటలో నిన్న సాయంత్రం తప్పిపోయిన చిన్నారులు ఆచూకీ లభ్యమైంది. మొండికుంట గ్రామం నుంచి తప్పిపోయిన ఇద్దరు బాలికలు కావ్య, నాగశ్రీ, ప్రసాద్‌లు మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిన్న సాయంత్రం ఆడుకుంటూ పొద్దు పోవడంతో తల్లిదండ్రులు కొడతారని భయంతోనే రాత్రి అదే ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం పోలీసులు గ్రామస్తులతో వెతుకుతుండగా కనిపించినట్లు తెలిపారు.