ప్రభాస్ నటించిన ‘కల్కి’ని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ బీట్ చేసింది. తాజాగా 2024లో గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ విడుదలైంది. దీంట్లో టాప్ టెన్‌లో మొదటి స్థానంలో ‘స్త్రీ 2’ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ‘కల్కి’ సినిమా ఉంది. అలాగే గ్లోబల్ లెవల్లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు.