Tspsc AE paper leak వెనక రేణుక.. సోదరుడి పేరు చెప్పి లీకేజ్
Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.
Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక (renuka) అని పోలీసులు (police) భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ (praveen kumar) లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ (ae paper leak) చేసింది. అయితే నిన్న ఏఈ పరీక్షను బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరిగి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేసింది.
రేణుక (renuka) గురుకులం హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ప్రవీణ్‌తో (praveen) పరిచయం ఏర్పడింది. మెల్లిగా పేపర్ లీక్ చేయాలని అనుకుంది. తన సోదరుడి కోసం అని.. ఇతరులకు విక్రయించింది. ఆమె సోదరుడు టీటీసీ చదివాడు. ఇంజినీరింగ్ చేయలేదు.. మరీ ఏఈ (ae )పరీక్ష అర్హుడు కాదు. కానీ ఆమె కావాలని అబద్దం చెప్పింది. విషయం తెలియక ప్రవీణ్ (praveen) పేపర్ ఇచ్చేశాడు. ఆమె వద్ద నుంచి రూ.10 లక్షల (rs.10 lakhs) నగదు తీసుకున్నాడు.
ప్రవీణ్ (praveen) నుంచి పేపర్ తీసుకున్న రేణుక (renuka).. నీలేశ్ (neelesh), గోపాల్ (gopal) అనే అభ్యర్థులకు పేపర్ అమ్మేసింది. వారి నుంచి రూ.14 లక్షలను (rs.14 lakhs) ముక్కుపిండి మరీ వసూల్ చేసింది. అందుల్లోంచి ప్రవీణ్‌కు (praveen) రూ.10 లక్షలు ఇచ్చి.. ఆ ఇద్దరికి సంబంధించి 4 లక్షలు సంపాదించింది. మరికొందరికీ కూడా పేపర్ విక్రయించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నీలేశ్ (neelesh), గోపాల్ (gopal) కాకుండా.. మరో 10 మందికి ఇస్తే.. ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూల్ చేసినా.. మొత్తం రూ.70 లక్షలు అవుతాయి. అంటే దాదాపు రూ. కోటి వరకు ఈజీగా రేణుక (renuka) అక్రమంగా సంపాదించి.. కొన్ని వేల మంది విద్యార్థుల జీవితంతో ఆడుకుంది. టీఎస్ పీఎస్సీ పేపర్ మళ్లీ నిర్వహించడం.. తిరిగి పరీక్ష రాయడం ఆ అభ్యర్థులకు సవాల్‌తో కూడిన పనే.. దీంతోపాటు సమయం కోల్పోతారు.
ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది (40) మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.
పేపర్ లీకేజీ అంశంలో ఇప్పటికే టీపీబీవో (tpbo), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఏఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ జరిగిందని ప్రచారం జరుగుతున్న.. అదేం లేదని బోర్డు చెబుతోంది.