Pawan-Sai Dharam Tej : వైరల్.. పవన్ ‘దేవుడు’ లుక్ లీక్!
Pawan-Sai Dharam Tej : గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అందులో నార్మల్‌గానే, కాస్త క్లాస్‌గా, మోడ్రన్ గాడ్‌గా కనిపించారు. దాంతో అప్ కమింట్ ప్రాజెక్ట్‌లోను.. దేవుడిగా ఇంచు మించు అలాగే కనిపిస్తాడని అనుకున్నారు.
గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అందులో నార్మల్‌గానే, కాస్త క్లాస్‌గా, మోడ్రన్ గాడ్‌గా కనిపించారు. దాంతో అప్ కమింట్ ప్రాజెక్ట్‌లోను.. దేవుడిగా ఇంచు మించు అలాగే కనిపిస్తాడని అనుకున్నారు. కానీ పవన్ లీక్డ్ లుక్ చూస్తే.. దేవుడు ఊరమాస్ అవతారం ఎత్తినట్టుంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదయ సీతమ్’ రీమేక్‌లో.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ దాదాపు 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చారు. అందుకోసం 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇప్పటికే పవన్ పార్ట్‌కు సంబంధించి కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ నెల ఎండింగ్‌తో పవన్ పోర్షన్ పూర్తి చేయనున్నారు. అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన కొన్ని మేకింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో పవన్ లుక్ అదరిపోయేలా ఉంది. చాలా అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు పవన్. గాడ్ అంటే ఏదో క్లాస్ అనుకున్నాం.. కానీ ఇదేం మాస్ రచ్చ మావా.. మా రియల్ గాడ్ స్టైలిష్ లుక్ అదరిపోయిందని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ లెక్కన గోపాల గోపాల సినిమాకు మించి.. అల్ట్రా మోడ్రన్ దేవుడులా కనిపించబోతున్నాడు పవన్. ఆయన పక్కనే సాయి ధరమ్ తేజ్ కూడా నిలబడి ఉన్నారు. పవన్ కటౌట్, బ్యాక్ గ్రౌండ్లో బైక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ రీమేక్‌తో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.