ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs Mlc kavitha) ఈరోజు ఈడీ(ED) విచారణలో పాల్గొననున్నారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవిత హాజర ఖరారైంది. మరోవైపు ఈ కేసులో మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కూడా నేడు కవితతోపాటు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(brs Mlc kavitha) కవిత నేడు మరోసారి ఈడీ(ED) ఎదుట హాజరుకానున్నారు. అయితే ఈ కేసులో హాజరు కావాలనే ఉత్తర్వులు రద్దు చేయాలని..ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించనుందని..తనను హింసించే అవకాశం ఉందని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. ఈ కేసు విషయంలో అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో కవిత ఈరోజు ఈడీ విచారణలో పాల్గొననున్నారు. కవితతో పాటు మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును ఈడీ గురువారం మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.
అయితే వారం లోపు కవిత రెండోసారి ED ముందు హాజరు కానున్న నేపథ్యంలో BRS నేతల్లో ఆమెను అరెస్టు చేస్తారెమోనని టెంన్షన్ పట్టుకుంది. మార్చి 11న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను దాదాపు తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది. కవిత మొబైల్ ఫోన్(mobile phone)ను ఈడీ స్వాధీనం చేసుకుంది.
మరోవైపు కవితకు నైతిక, న్యాయపరమైన మద్దతు తెలిపేందుకు మంత్రులు కె.టి.రామారావు(ktr), టి.హరీష్‌రావు(harish rao), ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు న్యాయవాదులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కవితకు మద్దతుగా మార్చి 11న న్యూఢిల్లీకి వచ్చిన డజన్ల కొద్దీ బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు అక్కడే ఉండి, గురువారం కవితను అరెస్టు చేస్తే దేశ రాజధానిలో నిరసనలు చేపట్టాలని యోచిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు(women reservation bill)ను పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కవిత ఇప్పటికే న్యూఢిల్లీ(delhi)లో 18 రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలతో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. శివసేన, ఆర్జేడీ, సీపీఐ, ఆర్ఎల్డీ, జేఎంఎం, ఆప్, ఎస్పీ, వీసీకే, డీఎంకే తదితర తొమ్మిది రాజకీయ పార్టీల ఎంపీలు రౌండ్ టేబుల్ సమావేశానికి(round table meeting) హాజరై మహిళా కోటా బిల్లు కోసం కవిత చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని(delhi liquor scam) రూపొందించడంలో అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డితో పాటు సౌత్ గ్రూప్‌కు ప్రాతినిధ్యం వహించడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ అధికారులు తెలిపారు. సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించినందుకు గాను న్యూఢిల్లీలోని ఆప్ నేతలు మొత్తం రూ.100 కోట్లు అందుకున్నారని ED చేసిన ప్రధాన ఆరోపణ. ఈడీ అరెస్టు చేసిన నిందితుల మధ్య వాట్సాప్ డేటా, చాట్ సంభాషణలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. దీని ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఆడిటర్ జి.బుచ్చిబాబు సమక్షంలో ఈడీ కవితను ఈ కేసులో ఆమె పాత్రపై ప్రశ్నించనుంది. అరుణ్ పిళ్లై ఇంకా ఈడీ అధికారుల కస్టడీలోనే ఉన్నారు.