తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తాని బిఎస్పీ (BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ (TSPSC) క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొలిక్కి తెస్తామని సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తాని బిఎస్పీ (BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ (TSPSC) క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొలిక్కి తెస్తామని సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రవీణ్, రేణుక వ్యవహారం.. ఏయే ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు.. అనే విషయాలపై విచారణ నిర్వహిస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి (Chairman Janardhan Reddy) వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రియురాలి కోసం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఫణంగా పెట్టాడని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌కి గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష(Group-1 Prelims Exam)లో 150కి 103 మార్కులు ఎట్లొస్తయి? అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా బాధకరమని ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ సిబ్బందికి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్‌కి అక్రమ యాక్సెస్ ఉందని చైర్మన్ బహిరంగంగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ (Paper leak) కాలేదన్న నమ్మకం ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చైర్మన్‌కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు ఎలా తెలిసిందో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కారుణ్య నియామాకాల్లో అపాయింట్ అయిన ప్రవీణ్ (Praveen) అనే వ్యక్తి.. తన ప్రియురాలి కోసం కాన్ఫిడెన్షియల్ (Confidential) మెటీరియల్ తీసుకున్నారంటే శోచనీయమన్నారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి (Janardhan Reddy)హయాంలో జరిగిన పరీక్షలన్ని రద్దు చేయాలని, చైర్మన్ పదవి నుండి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ క్రమంలోనే.. TSPSC దగ్గర హైటెన్షన్ నెలకొంది. పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు దశలవారీగా ధర్నాలకు దిగాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది ఏబీవీపీ(ABVP). లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనంతరం పీఎస్‌కు తరలించారు. లీకేజీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిచాంచాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నేతలు.ఏబీవీపీ (ABVP) కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా టీఎస్పీఎస్సీ వైపు దూసుకొచ్చారు ఆప్ విద్యార్థి సంఘం నేతలు. టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తానికి లీకేజ్ ఎపిసోడ్ తెలంగాణను (Telangana) కుదిపేస్తోంది.