మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) సర్కారు విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. బిల్లు ఆమోదం పొందే దాక అలుపెరగని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress)కలిసిరావాలని కవిత సూచించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నిరాహార దీక్ష చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) సర్కారు విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. బిల్లు ఆమోదం పొందే దాక అలుపెరగని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress)కలిసిరావాలని కవిత సూచించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత నిరాహార దీక్ష చేశారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత చెప్పారు. ఈడీ తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు.
ప్రధాని మోదీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు. వ్యాపార సంస్థలపై టార్గెట్ చేశారని, ఆ తర్వాత వాటిని నియంత్రించాలని చూస్తున్నారని విమర్శించారు. . ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. అంతకుముందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో భాగంగా ఈడీ (ED) నోటీసులపై సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె మార్చి 16న విచారణకు హాజరుకానున్నారు. ఇక కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరు కాగా.. రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai) కస్టడీ రేపటితో (మార్చి16తో) ముగియనుంది.