SKLM: బాల కార్మికులు నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎంపీడీవో ఆర్ వెంకట్రావు అన్నారు. ఆమదాలవలస MPDO కార్యాలయంలో బుధవారం కిషోర్ వికాసం పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కిషోర్ బాలికల చదువు, ఆరోగ్యం, రుతుక్రమ పరిశుభ్రత, అక్రమరవాణా, సైబర్ నేరాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.