VZM: చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి గరివిడి మండలం ఇందిరమ్మ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 8 PS లకు సంబంధించిన ముగ్గురు CIలు, సిబ్బంది పాల్గొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకే గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని DSP తెలిపారు. ప్రజలకు నేరాల నియంత్రణపై, చట్టాలపై అవగాహన కల్పించామన్నారు.